వేప
వికీపీడియా నుండి
|
|
| వేప | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
వేప (Neem) ఎన్నో సుగుణాలున్న చెట్టు.
[మార్చు] వేప చెట్టు
వేప (Azadirachta indica, syn. Melia azadirachta L., Antelaea azadirachta (L.) Adelb.) చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్త కు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిళ్ళు సమ శీతోష్ణ దేశాలయిన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్ మార్ , మరియు పాకిస్తాన్. ఇతరదేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాద్ డిరఖ్త (పర్షియ), డొగొన్ యార్లొ (నైజీరియా), మార్గోస, నీబ్ (అరబిక్), నిమ్ వృక్షము, నింబ (సంస్కృతము), వేపు, వెంపు, బేవు (కన్నడ), వెప్పం (తమిళము), ఆర్య వెప్పు (మళయాళము), భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో దీనినే మ్వారోబైని (కిస్వాహిలి) అంటారు. దీని అర్థం 'నలభై చెట్టు'. వేప నలభై వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు.
[మార్చు] స్వరూపము
వేప త్వరత్వరగా పెరిగి, 15 నుంచి 20 మీటర్లు, కొన్ని సార్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగ గలిగే చెట్టు. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే వేప తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలవరకు ఆకులను రాల్చుతుంది. దీని కొమ్మలు బాగా విస్తరించి ఉంటాయి. దట్టంగా ఉండే దీని శీర్షం గుండ్రంగా లేదంటే కోడి గుడ్డు ఆకారంలో ఉండి బాగా స్వతంత్రంగా పెరిగిన చెట్లలో 15 నుంచి 20 మీటర్ల వ్యాసం వరకు ఉంటుంది.
మొత్తం మీద చూస్తే మొండెము కురచగా నిటారుగ ఉండి, 1.2 మీటర్ల వ్యాసం వరకు పెరుగుతుంది. బెరడు గట్టిగా, పగుళ్ళతో లేక పొలుసులతో ఉండి, పాలిపోయిన బూడిదరంగు లేక ఎరుపుకలసిన ఊదా రంగులో ఉంటుంది. బెరడు వెనుకనుండే చెక్క (sapwood) బూడిదరంగు కలసిన తెలుపులోను ఉంటుంది. చెట్టుకు మధ్యన ఉన్న చెక్క (heartwood) గాలి తగలక ముందు ఎర్రగా ఉండి, క్రమేపి ఎరుపు కలసిన ఊదారంగులోకి మారుతుంది. వేరు వ్యవస్థలో బలమైన తల్లివేరు, బాగా అభివృద్ధిచెందే మిగిలిన వేళ్ళూ ఉంటాయి.
The alternate, pinnate leaves are 20-40 cm long, with 20-31 medium to dark green leaflets about 3-8 cm long. The terminal leaflet is often missing. The petioles are short. Very young leaves are reddish to purplish in colour. The shape of mature leaflets is more or less asymmetric and their margins are dentate with the exception of the base of their basiscopal half, which is normally very strongly reduced and cuneate.
[మార్చు] ఉపయోగాలు
- భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.
- వేపపువ్వు హిందువులు ఉగాది పచ్చడి లో చేదు రుచికోసం వాడతారు.
- వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.
- వేపనూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది.
- అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు.
- వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు.










/
/ 


























