వికీపీడియా:సమర్పణల ప్రశ్నలు
వికీపీడియా నుండి
|
|
(వికీపీడియా:Contributing FAQ నుండి దారిమార్పు చెందింది)
![]() |
| ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు యొక్క భాగము |
| ప్రశ్నల పేజీలు... |
| చూడండి... |
వికీపీడియా సమర్పకులు సాధారణంగా అడుగుతూ వుండే ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి తరచూ అడిగే ప్రశ్నల్ని ఈ పేజీలో ఇస్తున్నాం.
పేజీలలో ఎలా దిద్దుబాట్లు చేయాలి అనే విషయంపై మరిన్ని వివరాల కొరకు సహాయ పేజీ చూడండి.
[మార్చు] శుభారంభం
- రచనలు చెయ్యడం ఎలా?
- ఎన్నో మార్గాలు ఉన్నాయి! వికీపీడియాలో సమర్పణలు చూడండి.
- అసలు నేనెందుకు రాయాలి?
- అసలు నేనో వికీకి ఎందుకు సమర్పించాలి మరియు ఏమిటి వికీపీడియా గొప్ప లను చూడండి.
- దిద్దుబాట్లు చేసందుకు నేను నమోదు చేసుకోవాలా?
- లేదు. ఎవరైనా ఎటువంటి నమోదు కాకుండానే దిద్దుబాట్లు చెయ్యవచ్చు (నిషేధించిన విఛ్చిన్నకర సభ్యులు తప్పించి). (వికీపీడియా:అనామక దిద్దుబాట్లకు స్వాగతం చూడండి)
- సభ్యనామం యొక్క అవసరం ఏమిటి?
- చాలా కారణాలున్నాయి: వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.
- నేను నా అసలు పేరును ఉపయోగించాలా?
- అసలు పేర్లు అవసరం లేదు; కొంతమంది అసలు పేర్లు వాడతారు; కొంతమంది వాడరు.
- నా సభ్యనామాన్ని మార్చుకోవడం ఎలా?
- వికీపీడియా:సభ్యనామం మార్పు చూడండి.
[మార్చు] పదకోశం
- చర్చా పేజీల్లోనూ, దిద్దుబాట్ల చరితం, సారాంశాల్లోను వికీపీడియాకే ప్రత్యేకమైన కొన్ని పదాలను, పొడి పదాలను మీరు ఎక్కువగా చూస్తారు. కొత్తవారికి కొత్తగా అనిపించే పదాలు ఏవంటే;
- దిద్దుబాట్ల తాత్పర్యంలో వచ్చే rv లేదా revert అంటే ఆ పేజీని తిరిగి పూర్వపు కూర్పుకు పంపిచినట్లు. ఎక్కువగా ఇది దుష్ప్రవర్తన కారణంగా జరుగుతుంది.
- NPOV అంటే నిష్పాక్షిక దృక్కోణం కలిగివుండటం. దానికి వ్యతిరేకమైనది POV; అంటే సదరు రచన పక్షపాతయుతంగా ఉందన్నమాట.
- వికీకరణ అంటే మామూలు వ్యాసానికి అంతర్గత లింకులు పెట్టటం, ఇతర కూర్పులు చెయ్యడం వంటివి.
- అయోమయ నివృత్తి అంటే ఒకే పేరుతో ఉన్న వేరువేరు పేజీలను గుర్తించి తగు మార్పులు చెయ్యడం లేదా ఒక లింకును మెరుగు పరచి సరాసరి సంబంధిత వ్యాసానికి వెళ్ళేటట్లు చెయ్యడం.
- మరింత విస్తృత జాబితా కొరకు పదకోశం చూడండి.
[మార్చు] పేజీకి వ్యాసానికి మధ్య గల తేడా ఏమిటి?
- వికీపీడియా లో వున్న విజ్ఞాన వ్యాసాలు, చర్చా పేజీలు, డాక్యుమెంటేషను, ఇటీవలి మార్పులు వంటి ప్రత్యేక పేజీలు మొదలైనవన్నీ పేజీలే. "వ్యాసం" అనేది కేవలం విజ్ఞాన సర్వస్వంకు సంబంధించిన పేజీ మాత్రమే. అంటే, అన్ని వ్యాసాలూ పేజీలే, కానీ, అన్ని పేజీలు వ్యాసాలు కావు. మరింత సమాచారం కొరకు వికీపీడియా:వ్యాసం అంటే ఏమిటి చూడండి
[మార్చు] అనాధ అంటే ఏమిటి?
- వేరే ఏ ఇతర వ్యాసం నుండి లింకులు లేని వ్యాసాన్ని అనాధ అంటారు. వికీపీడియాను అన్వేషిస్తే ఇవి దొరుకుతాయి. ఎదో ఒక సంబంధిత వ్యాసంలో దీనికి లింకు పెట్టటం అనేది అభిలషణీయం. అనాధ వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు.
[మార్చు] మొలక అంటే ఏమిటి?
- వికీపీడియాలో ఒక పేరాగ్రాఫు లోపు వుండే చిన్న వ్యాసాన్ని మొలక అంటారు. కొంతమందికి మొలక అంటే పడదు, కాకపోతే అవి తప్పని తలనెప్పి వంటివి. చాలా గొప్ప వ్యాసాలు కూడా చిన్న మొలకలుగా మొదలైనవే, కాబట్టి, ఇప్పటి మొలకల్ని పూర్తిస్థాయి వ్యాసాలుగా విస్తృత పరచాలి. మొలకలపై సమాచారం కొరకు వికీపీడియా:మొలక ను చూడండి.
[మార్చు] అయోమయ నివృత్తి ఏమిటి?
- వికీపీడియా:అయోమయ నివృత్తి చూడండి.
[మార్చు] చిన్న మార్పు అంటే ఏమిటి? దాన్నెప్పుడు వాడాలి?
- వికీపీడియా లో లాగిన్ అయిన సభ్యుడు తాను చేసే మార్పులను "చిన్న" మార్పులుగా గుర్తు పెట్టే అవకాశం ఉంది. ఇలా గుర్తు పెట్టడం అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాల్ని బట్టి ఉంటుంది. ఒక బండ గుర్తు ఏమిటంటే చిన్న వ్యాకరణ దోషాలు, వ్యాసం అమరికలో చేసే చిన్న చిన్న మార్పులు, కొద్ది పదాలను మార్చడం మొదలైనవి చిన్నమార్పుల కోవ లోనికి వస్తాయి. అంత మాత్రాన, "తీవ్రవాది" ని "స్వాతంత్ర్య సమర యోధుడు" అని మార్చి, ఒకే పదం మార్పు కదా అని దీన్ని "చిన్న" మార్పు అని గుర్తించరాదు.
- చిన్న మార్పులను "చిన్న" మార్పులుగా గుర్తు పెట్టడం మరో రకంగా కూడా ముఖ్యమైనది - సభ్యులు ఇటీవలి మార్పులు చూసేటపుడు మార్పుల సంఖ్యను తగ్గించి చూడడానికి చిన్న మార్పులను "దాచ" వచ్చు.
- లాగిన్ కాని వారు చిన్న మార్పులని గుర్తు పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే దుష్ప్రవర్తనతో కూడిన మార్పులను చిన్న మార్పులుగా గుర్తు పెడితే, వాటిని గుర్తించడంలో ఆలస్యమవుతుంది కనుక. అకౌంటు సృష్టించి లాగిన్ అయివుండాలనటానికి ఇది మరో కారణం.
- ఇంకా చూడండి: వికీపీడియా:చిన్న మార్పులు.
[మార్చు] సాధారణం
[మార్చు] ఈ ప్రశ్నల్లో కంటే ఇంకా ఎక్కువ సమాచారం ఎక్కడ దొరుకుతుంది?
- వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము తో మొదలు పెట్టండి. సహాయం పేజీలో చక్కని సూచిక ఉంది, వికీపీడియా:విషయ సూచిక లో వివిధ లింకులకు సంబంధించి పెద్ద జాబితా ఉంది.
[మార్చు] నేను తెలుసుకోవలసిన నియమాలు, మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా?
- వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు చూడండి. ఇందులో:
- పేజీల పేర్లకు ప్రామాణికాలు: వికీపీడియా:నామకరణ పధ్ధతులు
- ఒకే పేరున్న వేరు వేరు పేజీలతో వ్యవహారం: వికీపీడియా:అయోమయ నివృత్తి ఉంటాయి.
[మార్చు] ఇటీవలి మార్పులు అంటే ఏమిటి, అక్కడ వాడిన పొడి పదాల అర్ధం ఏమిటి?
- ఒక నిర్ణీత సమయం లోపు చేసిన మార్పులను ఇటీవలి మార్పులు అంటారు. దీనిపై సమాచారం కొరకు వికీపీడియా:ఇటీవలి మార్పులు చూడండి.
[మార్చు] తేదీ వంటి వాటికి ప్రామాణికమైన మూసలు ఏమైనా ఉన్నయా?
- శైలి మాన్యువల్ చూడండి.
[మార్చు] ఒకే విషయంపై రెండు వ్యాసాలుంటే ఏం చెయ్యాలి?
- ఏముందీ, చొరవ తీసుకుని వాటిని కలపండి. చక్కగా అతికే పేరును ఎంచుకోండి (ఉన్న రెండూ కాక వేరే పేరైనా పరవాలేదు!). ఏ పేరు వాడాలో నిర్ణయించుకోలేకపోతేనో లేదా అసలా వ్యాసాల్ని కలపాలో అక్కర్లేదో నిర్ణయించుకోలేక పోతేనో, ఏదో ఒక వ్యాసపు చర్చా పేజీలో రాసి (రెండో వ్యాసపు చర్చా పేజీలో దీనికి లింకు పెట్టండి) ఆ విసయమై ఇతర వికీపీడియన్లు ఏమంటారో గమనించండి.
[మార్చు] వ్యాసానికి గరిష్ఠ/అనుకూలమైన పొడవు ఎంత? వ్యాసాన్ని ఎప్పుడు చిన్న చిన్న భాగాలుగా విభజించాలి?
- వికీపీడియా:వ్యాసపు పరిమాణం చూడండి
[మార్చు] వ్యాస విషయాలపై ఇక్కడ చర్చించ వచ్చా?
- ఇది ఒక విజ్ఞాన సర్వస్వం, విషయాలను నిష్పాక్షిక దృక్కోణంతో ప్రచురించడానికి శ్రమిస్తుంది. మీ అభిప్రాయంతో ఏకిభవించేలా వేరే వారిని ఒప్పించడం కోసం చేసే చర్చను IRC ఛానెల్స్ లో చెయ్యవచ్చు. అయితే వ్యాసాలను మెరుగు పరచే ఉద్దేశ్యంతో చేసే చర్చ ఇక్కడ చెయ్యవచ్చు; వ్యాసానికున్న చర్చా పేజీలో ఇది జరుగుతుంది.
[మార్చు] దుశ్చర్యను గమనించాను, లేదా పొరపాటున నేనే ఒక పేజీని పాడు చేసాను! దాన్నెలా సరిదిద్దాలి?
[మార్చు] ఏయే భాషలు వాడవచ్చు?
- తెలుగు వికీపీడియా లో తెలుగే వాడాలి -మీరు రాసే పదానికి తెలుగు అనువాదం లేకపోతే తప్ప. వేరే భాషల్లో రాయదలుచుకుంటే వివిధ భాషల్లో వికీపీడియాలున్నాయి, అక్కడ రాయవచ్చు. వీటి లింకుల కొరకు బహుళ భాషా సమన్వయంలో చూడండి. మీ భాష ఇంకా ఆచరణలో లేకపోతే, వికీపీడియా-L లో సభ్యులై మీకోరికను తెలియజేయవచ్చు.
[మార్చు] కొన్ని లింకులు ఎర్రగా ఎందుకుంటాయి? ఈ "?" లింకులు ఏమిటి?
- అవి రెండూ కూడా ఆ పేరుతో నున్న పేజీ ఇంకా మొదలు కాలేదని తెలియజేస్తాయి. ఈ రెండింటిలో ఏది మీకు కనపడుతుందనేది మీ ప్రత్యేక:అభిరుచుల ను బట్టి వుంటుంది. "ఖాళీ పేజీల లింకులను గుర్తించు" అనేది ఎంచుకుని వుంటే, మీకు ఎర్ర లింకులు కనిపిస్తాయి. లేకపోతే, చిన్న నీలం రంగు ప్రశ్నార్ధకాలు కనిపిస్తాయి.
- ఏ విధంగా నయినా సరే, ఆ లింకును నొక్కి ఆ పేరుతో మీరో కొత్త పేజీని మొదలు పెట్టవచ్చు. జాగ్రత్త సుమా-- అటువంటి విషయాల పై వేరే వ్యాసాలు ఉండవచ్చు, లేదా అదే వ్యాసం వేరే పేరుతో ఉండవచ్చు. అటువంటి విషయాల గురించి ముందు వెదకడం అనేది ముఖ్యం. పేజీలకు పేరు పెట్టే విషయంపై సమాచారం కొరకు వికీపీడియా:నామకరణ పధ్ధతులు చూడండి.
[మార్చు] సరే, ఈ తేలిక నీలం రంగు లింకుల సంగతేమిటి?
- ఇవి బయటి లింకులు; అంటే, వికీపీడియా కు బయట ఉండే పేజీల లింకులు. అవి ఇలా కనపడతాయి.
[మార్చు] ఒకే పేజీలో ఇద్దరు సభ్యులు ఒకే సమయంలో దిద్దుబాట్లు చేస్తే ఏం జరుగుతుంది?
- దీనిని "దిద్దుబాటు ఘర్షణ" అంటారు. రెండు కూర్పులను రెండు విండోలలో చూపిస్తూ వాటిలోని తేడాలను హైలైట్ చేసి (ఇద్దరూ చేసిన మార్పులు మాత్రమే చూపిస్తుంది కానీ వాళ్ళు చేసిన ఒకే విధమైన మార్పును చూపించదు), తరువాత వారెలా ముందుకు సాగాలో తెలియజేస్తుంది. సమాచారం ఏ కొంచం కూడా పోయే అవకాశం లేదు.
- భవిష్యత్తులో రెండు కూర్పులను దానంతట అదే కలిపేసే సాఫ్ట్‌వెర్ రావచ్చని వికీపీడియా డెవెలపర్లు తెలియజేస్తున్నారు.
[మార్చు] దిద్దుబాటు మధ్యలో ఉండగా నా కంప్యూటరు గాని బ్రౌజరు గాని క్రాష్ అయితే, లేక సర్వరు స్పందించకపోతేనో ఏమి జరుగుతుంది?
- క్రాష్ అయితే మీ దిద్దుబాట్లు పోతాయి. ఏదో ఒక టెక్స్ట్ ఎడిటరు వాడి దీనినుండి కొంతవరకు బయట పడవచ్చు (కానీ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోక పోతే క్రాష్ అయిన సందర్భంలో ఇదీ పనిచేయదు).
- సర్వరు టైమవుట్ అయినప్పుడు దిద్దుబాట్లు పోవడం పోవకపోవడం అనేది మీ బ్రౌజరును బట్టి వుంటుంది. కొన్ని బ్రౌజర్లు (ఉదా..మొజిల్లా ఫైర్‌ఫాక్స్) బాక్ బటను నొక్కినపుడు మీరు రాసిన దాన్ని మళ్ళీ చూపిస్తాయి. కొన్నిటిలో అవి పోతాయి. ఆ టెక్స్ట్ ను కాపీ చేసుకుని (కనీసం క్లిప్‌బోర్డుకు) రక్షించుకోవచ్చు. మీరిది చేయకపోతే, బాక్ బటను నొక్కి వెనక్కి వెళ్ళి, రిఫ్రెష్ చేస్తే కనీసం ఇటీవలి కూర్పును పొందవచ్చు.
[మార్చు] ఒక విషయంపై జరిగే మార్పుల సంగతి ప్రతిసారీ ఆ పేజీకి వెళ్ళకుండానే ఎలా తెలుసుకోవడం?
- మీరు లాగిన్ అయివుంటే, ప్రతిపేజీలోను మీకు "ఈ వ్యాసాన్ని వీక్షించు" అనే లింకు కనిపిస్తుంది. దానిని నొక్కితే, ఆ వ్యాసం మీ స్వంత వీక్షణ జాబితా లో చేరిపోతుంది. మీరు గమనిస్తున్న వ్యాసాల లోని ఇటీవలి మార్పులను మీ వీక్షణ జాబితా చూపిస్తుంది.
[మార్చు] బొమ్మలకు/వీడియోలకు ఏ ఫైల్ ఫార్మాట్ ను వాడాలి?
- ఫోటోగ్రాఫులకు JPEG ను, డ్రాయింగులకు, లోగోలు మొదలైన వాటికి PNG ని వాడాలి. PNG కి బదులుగా GIF ను వాడవచ్చు గానీ పేటెంటు కారణాల వలన దానిని ప్రోత్సహించడం లేదు. ఇక వీడియో, మంచి ప్రశ్న; అది ఇంకా లేదు. మరింత సమాచారం కొరకు వికీపీడియా:బొమ్మలు వాడుకునే విధానం చూడండి.
[మార్చు] శబ్దానికి ఏ ఫైల్ ఫార్మాట్ ను వాడాలి?
- వివిధ ఫార్మాట్లను ప్రోత్సహిస్తున్నాం. WAV మరియు Ogg Vorbis లను అంగీకరిస్తాం, కానీ MP3 ని ఒప్పుకోం. మరింత సమాచారం కొరకువికీపీడియా:శబ్దం ను చూడండి.
[మార్చు] ఒక సమర్పకుడు మరీ అసంబధ్దంగా ఉన్నారు. సాయం చెయ్యగలరా!
- వికీపీడియా:సంయమనంతో ఉండండి మరియు వికీపీడియా:వివాద పరిష్కారం చూడండి.
[మార్చు] "నా మార్పులు చేర్పులు" జాబితా లోని సమర్పణల సంఖ్యను నేను మార్చవచ్చా?
- ప్రస్తుతానికి కుదరదు.
[మార్చు] నేను రాసిన వ్యాసాన్ని ఎందుకు తొలగించారు?
-
- కొత్త వ్యాసాలను వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల ను పాటించనందుకు తొలగిస్తారు. మీ వ్యాసాన్ని తొలగించినా సరే, మీరు మరిన్ని వ్యాసాలను సమర్పించవచ్చు.
- వ్యాసాలను త్వరగా తొలగించడానికి కారణాలిలా ఉండవచ్చు:
- అసందర్భంగా ఉండే వాక్యాలతో కూడిన చాలా చిన్న పేజి(ఉదా.. "నాకు దాహం వేస్తోంది. అయినా సరే అనకాపల్లి ఎంత పెద్దదో నాకు తెలియదు.").
- అర్ధం పర్ధం లేని వాక్యాలు లేదా చరితం (ఉదా.. "స్ధ్ఘీదూXఫ"). సిసలైన చెత్త ను చూడండి.
- పరీక్షా పేజి (ఉదా.. "నేనిక్కడ కొత్త పేజిని తయారు చెయ్యగలనా?").
- సిసలైన దుశ్చర్య(దుశ్చర్యను ఎదుర్కోవడం చూడండి). మీలో చెడు తలంపులు లేకపోతే, మీ వ్యాసం ఈ కోవ లోకి రాదని తెలుసుకోండి.
- తొలగింపు విధానం కింద ఇంతకు ముందు తొలగించిన దానిని మళ్ళీ సమర్పించడం. పున:ప్రతిష్ఠ విధానం ప్రకారం తిరిగి చేర్చిన వాటికి ఇది వర్తించదు.
- ఒక సభ్యుని నిషేధించిన తరువాత ఆ సభ్యుడు తానొక్కడే సృష్టించి, దిద్దుబాట్లు జరిపిన పేజీ (నిషేధాలూ అడ్డగింపులు చూడండి). దీని విషయంలో భేదాభిప్రాయాలున్నాయి!
- ఇప్పటికే ట్రాన్స్‌వికీ పధ్దతిలో వ్యాసాన్ని తరలించినపుడు.










/
/ 

























