వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)
వికీపీడియా నుండి
|
|
| రచ్చబండ | |
|---|---|
| ప్రతిపాదనలు | వార్తలు | పాలసీలు | సాంకేతికము | సహాయము | విశేష వ్యాసం | అనువాదాలు | ఇతరత్రా.. | |
|
|
[మార్చు] new section for agriculture and related issues..
వ్యవసాయం కోసం ఒక శీర్షిక పెడితే బాగుంటుందేమో ? తె.వికీ నిజంగా ఒక విజ్ఞాన సర్వస్వం కావాలటే, సాగుబడిలో ఉండే విషయాల గురించి వివరాలు కూడా చేర్చాలి.
- మీ సూచన బాగుంది. తప్పక చేద్దాము. ఇప్పటికి వ్యవసాయం గురించి పెద్దగా వ్యాసాలు లేనందున ఈ శీర్షిక పెట్టలేదు. ప్రస్తుతానికి వర్గం:వ్యవసాయం, వర్గం:పంటలు ఉన్నాయి. ఈ వర్గాలలో వ్యాసాలను మీరు మరింతగా మెరుగుపరచ వచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:42, 13 మే 2008 (UTC)
[మార్చు] ఈ వారం వ్యాసాలు దిన పత్రికలో
నాకొక అలోచన వచ్చింది! వికీలో ప్రతివారం "ఈ వారపు వ్యాసం" గా పూర్తిగా వ్రాయబడిన/పరిణితి గలిగిన వ్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగు దిన పత్రికలన్నిటికి ఆదివారం అనుబంధాలు ఉన్నాయి. అందులో ఏదయినా పత్రికకు, ప్రతివారం, వికీలో ప్రర్శించబడిన/బడుతున్న "ఈ వారం వ్యాసం" ను ప్రచురించటానికి అనుమతి ఇస్తే ఎలా ఉంటుంది. వ్యాసం చివర తెలుగు వికీలోకి ఎలా ప్రవేశించాలి, వెబ్ చిరునామా వివరాలు ఒకటి రెండు వాక్యాలు జతపరచాలి. దీనివల్ల, ఈ వారం వ్యాసం వేల మంది చదువుతారు. అందులో పదిమందయిన ఆ విషయంమీద ఇంకా ఎక్కువ సమాచారం తెలిసినవారయి, వికిలోకి వచ్చి, వ్యాసాన్ని మరింత పరిపుష్టం చెయ్యచ్చు. ఇంకా అనేకమంది, తెలుగు వికి తెలియని తెలుగు వారు వికీ గురించె తెలుసుకుని, సభ్యులుగా చేరి వారి వారి కంట్రిబ్యూషన్ కూడ చేసే అవకాశం ఉన్నది. ఇతర సభ్యులు, ఈ విషయం మీద చర్చించగలరు.--SIVA 10:19, 8 జూన్ 2008 (UTC)
- వికీలో ఉన్న వ్యాసాలన్నిటినీ ఎవరయినా ఏవిధంగానయినా ఉపయోగించుకునే/ప్రచురించుకోగలిగే అవకాశం ఉంటుంది.అందుకు వారు ఎవరివద్ద నుండి అనుమతి కూడా తీసుకోనవసరం లేదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 11:37, 8 జూన్ 2008 (UTC)
- GFDL లైసెన్సు గురించి బహుశా తెలియకపోవడం వల్ల శివా అలా "అనుమతిస్తే" అని వ్రాశారు అనుకొంటాను. కాని ఆయన ఆలోచన సరైనదే. విద్యాలయాలు, పత్రికలు వికీ ప్రగతికి తోడ్పడగలిగే శక్తి కలిగి ఉన్నాయి. కాని అందుకు ఎవరు ఉత్సాహం చూపుతారో చూడాలి. ప్రస్తుతం వస్తున్న "ఈ వారం వ్యాసాలు" ఇంకాస్త మెరుగుపరిస్తే గాని "విశేష వ్యాసాలు" స్థాయికి చేరుకోవు. ప్రస్తుతం మన పని ఇలా కొనసాగిద్దాం. ఆచరణ సాధ్యమైతే శివా సూచన అమలు చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:33, 8 జూన్ 2008 (UTC)
[మార్చు] శివ సమాధానం
ప్రచురణకు "అనుమతిస్తే" అని ఎందుకు వ్రాశానంటే, మనకు తెలుసు వికీలో ఉన్న వ్యాసాలకు ఎవరూ అనుమతి తీసుకోకుండా ప్రచురించవచ్చని. కాని, పత్రికల వారికి తెలియక పోవచ్చునుగదా. వారు, దీనికి ప్రచురణకు అనుమతి పొందాలి, ఎవరిదగ్గరనుంచి పొందాలి అని భావిస్తూ ఉండచ్చు. అందుకని, వికీ నిబంధనలు అనుమతిస్తే, కొన్ని సెలక్ట్ వార పత్రికలకు (అతి కొద్ది మిగిలినాయి) లేదా దిన పత్రికలకు వికీ ద్వార అఫీషియల్ గా తెలియ చేస్తే(ఈ మైలు ద్వార) కొన్ని వ్యాసాలు వరుసగా ఏదయినా వార/దిన పత్రిక ప్రచురించటం మొదలు పెట్టవచ్చు. ఒక్కటే నిబంధన, వ్యాసం చివర రెండువాక్యాలు తెలుగు వికీ చిరునామా, అందులోకి ఎలా వెళ్ళాలి అని మాత్రం తప్పనిసరిగా తెలియచేయాలి.దీనివల్ల తెలుగు వికీ ఎక్కువ ప్రాచుర్యం సంపాయించి మరింతమంది చురుకైన సభ్యులను పొందవచ్చని నా ఆకాంక్ష.--SIVA 10:32, 15 జూన్ 2008 (UTC)
[మార్చు] Position is Wroనg in google in site maps.google.com (మీరు ఇలాంటి స్థానభ్రంసాలు వ్రాయండి)
maps.google.com లో రాజోలు యొక్క స్థానం తప్పుగా చూపటం జరిగింది.
[మార్చు] ప్రగతికి సోపానాలు
ముచ్ఛటైన మూడు సూత్రాలు విధ్య వైధ్యం సేధ్యం చిరు మార్గదర్శకాలు ప్రగతికి సోపానాలు
[మార్చు] వికీపీడియ పదమునకు బదులు "తెలుగు వికిపీడియా" అని వాడుట
మొదటి పేజీలో కాని, మరెక్కడైనా "వికిపీడియా" అనే పదం వాడినప్పుడు, దానికి బదులుగా "తెలుగు వికిపీడియా" అనే పదం వాడితే బాగుంటుందని నా ప్రతిపాదన. పరిశీలించగలరు. Madhavarao, pabbaraju 12:56, 7 ఆగష్టు 2008 (UTC)
Madhavarao, pabbaraju 14:32, 7 ఆగష్టు 2008 (UTC)—== ఈ వారం వ్యాసం - శివగారి అభిప్రాయం-నా అభిప్రాయం ==
."ఈ వారం వ్యాసం" పై, ఇతర తెలుగు పత్రికలలొ ప్రచురించటానికి అనుమతి ఇస్తే బాగుంటుందని శివగారు అభిప్రాయ పడ్డారు. అయితే, తెవికీలొ ఈ వారం నెల్సొన్ మండెలా పై వ్రాసిన వ్యాసం చాల వివరణాత్మకముగా వున్నది.సభ్యుల సమిష్టి పరిశొధనా ఫలితమని తలుస్తాను. అదే విధంగా శివగారి చందమామ తెలుగు మాస పత్రికపై వ్రాసిన వ్యాసం కూడా ఎంతో వివరణాత్మకముగా వున్నది. బహుశా, తెలుగు దినపత్రికలు కూడా ఇంతకంటే గొప్పగా వ్రాయక పోవచ్చు. తెలుగు వికిపేడియా లో వివిధ రచనలు చెయుట కొరకు పరిశొధనా బ్రుందం వున్నట్లే, తెలుగు దినపత్రికలలొను వుంటాయి కాబట్టి, ప్రత్యేక అనుమతి ఇవ్వవలసిన అవసరం వుండకపోవచ్చని నా అభిప్రాయం. అయితే, తెలుగు వికిపేడియా గురించి, తెలుగు పత్రికల ద్వారా, తెలుగు ప్రజలకి తెలియచెస్తే చాల బాగుంటుంది.
[మార్చు] పుస్తకాలు కావాలి
నాకు రావూరి భరద్వాజ గారి పుస్తకాల కాపీలు కావాలి.ఏవరి వద్దఎనా వుంటె srigargeya_1@yahoo.co.in 9949497202(sai)కి దయఛెసి తెలుపగలరు. భవదీయుడు పరవస్తు నాగ సాయి సూరి.
[మార్చు] Translation
Hey Dev! Are you available to finish this translation on Meta-Wiki? You can do it here. If you need help, you can talk to us on IRC at #wikimedia-translation, e-mail me, or leave a message on my meta talk page. Thanks! Cbrown1023 చర్చ 21:33, 29 ఆగష్టు 2008 (UTC)
- ఇక్కడ నేను అనువదించాను. ఎవరైనా ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేయగలరా? ఇంకో విషయం, Tell_us_about_Telugu_Wikipedia పేజీలో ప్రశ్నలకు జవాబులు రాయగలరా? δευ దేవా 08:40, 30 ఆగష్టు 2008 (UTC)
[మార్చు] ప్రస్తుత రాష్త్ర రాజకీయాల గురించి, ఒక మంచి పార్తి గురించి రాబొయె ప్రభుత్వం గురించి అన్దరి అభ
ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికి ఇలా ఉండటానికి కారణాలు ఏమిటి. మార్పు ఎక్కడ రావాలి. ప్రజలలోనా లేక ప్రభువులలొనా. మార్పును తెస్స్తాము అంటు వచ్ఛిన జయ ప్రకాష్ నారాయణ గారిని ప్రజలు ఎందుకు.. ఆహ్వానించడంలేదు? చిరంజీవిని ఎందుకు... అంతలా ఆరాధిస్తున్నారు... అసలు.. లోపం ఎక్కద ఉన్నది. ప్రజలలోనా? లేక... ఏమో... నాకు అయితే.. ప్రజలలోనే అని..అనిపిస్తూ ఉంది.. దీని మీద.. మీ అందరి అభిప్రాయాలు అహ్వానిస్తున్నాను.
- వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. . రచ్చబండలో మామూలుగా వికీపీడియాలోని వ్యాసాలు, మొదలైన సమాచారం గురించి చర్చ జరుగుతుంటుంది. అభిప్రాయాలకు ఇది సరైన వేదిక కాదు. వాటికి బ్లాగులు సరైనవని నా అభిప్రాయం. రవిచంద్ర(చర్చ) 08:48, 13 సెప్టెంబర్ 2008 (UTC)
[మార్చు] కథానిలయం గ్రంథాలయం లోని రచనలు, రచయితల వివరాలు
కథానిలయం పేజీ ఖాళీ గా ఉండటం బాధగా ఉంది. దయ చేసి కథానిలయం లోని రఛనల వివరాలు రఛయితల వివరాలు ఉంచండి.
- వినయ్ గారూ! మీకు ఈ వ్యాసం విస్తరించాలని ఆసక్తి ఉండడం సంతోషం. ఇవి వ్రాసినవారు తమకు లభించినమేరకు సమాచారాన్ని ఇందులో కూర్చారు. విషయం విపులంగా తెలిసినవారు ఇలాంటి వ్యాసాలను మరింత విస్తరిస్తారని మా ఆకాంక్ష. మీకు ఏవైనా వివరాలు తెలిస్తే తప్పక చేర్చేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:09, 27 సెప్టెంబర్ 2008 (UTC)
[మార్చు] తెలంగానా గురింఛి చర్ఛ
నెడు రాస్త్రం లొ వేడీ గా ఈ ఛర్ఛ నడుస్తుంది కావున దీని గూర్చి సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొంటే బాగుంటుంది K.P.AJAYKUMAR 11:11, 24 అక్టోబర్ 2008 (UTC)కె.పి.అజయ్ కుమర్
- ఇక్కడ వ్యాసాలు, సాంకేతికాంశాల తదితర వికీపీడియాకు సంబంధించిన అంశాలపైన మాత్రమే చర్చ జరుగుతుంది. బయటి చర్చలకు దీనికి సంబంధం లేదు గమనించండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 16:06, 24 అక్టోబర్ 2008 (UTC)
మీ సలహా కు ధన్యవదాలు ajay 04:30, 25 అక్టోబర్ 2008 (UTC)
[మార్చు] తెలుగు ప్రాచీన హోదా పై
తెలుగుకు ప్రాచీన హోదా లభించిన ఈ సందర్భంలో దాని పై ఓ వ్యాసాన్ని తయారు చేస్తీ బాగుంటుంది.
[మార్చు] విశేషవ్యాస ప్రతిపాదన
ఆది శంకరాచార్యుడు వ్యాసాన్ని విశేషవ్యాసంగా గుర్తించాలని ప్రతిపాదించాను. సభ్యులు దయచేసి తమ అభిప్రాయాలను వికీపీడియా:విశేషవ్యాసాలు/ప్రతిపాదనలు/ఆది శంకరాచార్యుడు అను పేజీలో తెలుపవలసినదని కోరుతున్నాను.
Cnbrajesh 12:35, 18 డిసెంబర్ 2008 (UTC)
[మార్చు] కవిత్వ అభిమానులకు కానుకగా కవితా పేజీని కూడా కేటాయిస్తె బాగంటుంది.........
కవితాభిమానులకు మన రోజువారీ పేజీలో ఒక కాలం కేటాయిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతీ వార్తా పత్రిక వాళ్ళు ఆది సోమవారంలలో సాహిత్య పేజీలు కేటాయిస్తున్నారు. మన విశ్వ వీచికలో కూడా కొంత మేర కేటాయింపు వుండాలని నా ఆశ.కవితా దాహార్తిని తీర్చే ప్రయత్నం మనం మాత్రం ఎందుకు చేయకూడదు. ़~~़జంఝావతి.
- జంఝావతి గారూ! మీ సూచనకు కృతజ్ఞతలు. ఇదివరకు నేను కూడా "ఈ వారం పద్యం" లాంటి ఒక కాలమ్ ఉండాలని కోరాను. కాని వికీపీడియా ప్రధానంగా వ్యాసాలకు పరిమితమైనది గనుక ఇది అందుకు సరైన స్థలం కాదు అని భావించారు. అందుకు వికీవ్యాఖ్య, వికీ మూలములు లు సరైన ప్రాజెక్టులు. అవి ఒకమారు చూడగలరు. కవిత్వం, సాహిత్యం గురించిన వ్యాసాలు ఇక్కడ వ్రాయవచ్చును. మీరు కూడా సహకరించమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:26, 23 డిసెంబర్ 2008 (UTC)
[మార్చు] "తెలుగు-to-తెలుగు పదకోశం" అనే నూతన విభాగం ప్రారంభించాలని సూచన.
తెలుగు వికీ లోని వివిధ విభాగాలు, విశయాలు పరిశీలించిన మీదట తెలుగు వికీ యొక్క వుపయోగతను విస్త్రత పరిచే ఒక సలహాను ఇవ్వదలచాను. దీనిలో ఒక పదకోశ విభాగాన్ని(Telugu-to-Telugu Dictionary) ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విజ్ఞులైన నిర్వాహకులు ఈ అంశం గురించి పరిశీలిస్తారని ఆశిస్తూ...
- తెలుగు - తెలుగు పదకోశం వికీపీడియాలో విక్షనరీ పేరు మీద ఉన్నది. ఒకసారి చూడండి.Rajasekhar1961 03:48, 5 జనవరి 2009 (UTC)










/
/ 


























