మూస:విశేష వ్యాసము1
వికీపీడియా నుండి
|
|
సుడోకు ఒక తర్క-భరితమైన, గళ్ళలో ఆంకెలు నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికలో ఒక 9x9 గళ్ళ చతురస్రము ఉంటుంది. అందులో మళ్ళీ తొమ్మిది 3x3 చతురస్రాలు ఉంటాయి. ఈ గళ్ళలో 1 నుండి 9 వరకు నింపాలి. చిన్న చతురస్రం (3x3)లో కాని పెద్ద చతురస్రం(9x9)లో అడ్డు మరియు నిలువు వరుసలలో ఒకసారి ఉపయోగించిన అంకెలు మరోసారి ఉపయోగించరాదు. ఈ ప్రశ్నా ప్రహేళికలో అక్కడక్కడా కొన్ని అంకెలు నింపబడి ఉంటాయి. పూర్తయిన ప్రహేళిక ఒక రకమైన లాటిన్ చతురస్రము పోలి ఉంటుంది. లియొనార్డ్ ఆయిలర్ అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కానీ, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము అమెరికాకు చెందిన హావర్డ్ గార్నస్. ఈ ప్రహేళిక 1979లో డెల్ మ్యాగజిన్ లోని నంబర్ ప్లేస్లో మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని సుడోకు అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో సుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది. సుడోకు, "సూజీ వ డొకుషిన్ ని కగీరూ" అనే పెద్ద జపనీసు వాక్యానికి సంక్షిప్త నామము. అనగా జపనీసు భాషలో "ఒక్కొక్క అంకె ఒక్కొక్క సారి మాత్రమే రావలెను" పూర్తివ్యాసం : పాతవి










/
/ 


























