బొమ్మలకొలువు
వికీపీడియా నుండి
|
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
సర్వసాదారణంగా పిల్లల ఆనందం, ఉత్సాహాల కోసం తీర్చిదిద్దే దీనినే దసరా బొమ్మల కొలువు అని కూడా అంటారు. దసరా నవరాత్రులలో పది రోజులు (9 రాత్రులు)ఈ సరదా బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండగ జరుగుతుంది. దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్ధిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు.
విషయ సూచిక |
[మార్చు] అలంకరణ
పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లు పై ప్రాపంచిక జీవితానికి సంబందించిన బొమ్మలు వుంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. మధ్యభాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధవీరుల వంటి బొమ్మల నుంచుతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టు మీదవుంచే కలశం దేవీ కరుణకు సూచనగా బావిస్తారు. ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని అంటారు. ఇదీ బొమ్మలకొలువు తత్వము. మెట్ల పై తెల్లని వస్త్రము పరచి ఆ పై బొమ్మలను అమర్చుతారు.
[మార్చు] విశేషాలు
దీప ధూప నైవేద్యాలతో ప్రతిరోజూ లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజలు చేస్తారు. రోజూ ఒక కన్య కి (చిన్నఅమ్మాయి), ఒక సుహాసినికీ భోజనము పెట్టి తాంబూలం, అలంకరణ వస్తువులు, బట్టలు ఇస్తారు. ఇలా దసరా తొమ్మిది రోజులు చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ పసుపు - కుంకుమ, తాంబూలము, దక్షిణ ఇస్తే తమకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఆ సమయములో మగువులంతా ఇచ్చుపుచ్చుకొనే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నము. అష్టగంధము, పసుపు ఆరోగ్యానికి చిహ్నాలు. మహిషాసురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలము సూది మొన మీద తపస్సు చేసిందంటారు. అందుకని బొమ్మల కొలువున్నన్ని రోజులు సూదిలో దారము పెట్టి ఏపని చెయ్యరు. ఈ బొమ్మలకొలువు ప్రతి సంవత్సరము చేస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి కి బొమ్మల కొలువు పెడతారు. బొమ్మలు అమర్చే పద్ధతి మాత్రం ఇదే. బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు చోటు చేసుకున్నాయి కానీ ఒకప్పుడు మట్టి బొమ్మలు, పింగాణీ బొమ్మలు మాత్రమే ఉండేవి.
[మార్చు] సాదారణంగా అలంకరించే బొమ్మలు
దేవుని బొమ్మలైన గణపతి, రాముడు , కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, మరియు తత్వవేత్తలైన వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, బుద్దుడు, లాంటివి. స్వాతంత్ర్య సమరయోదుల బొమ్మలు, పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు, క్రికెట్ టీం బొమ్మలు మొదలగునవి.










/
/ 


























