గుండె
వికీపీడియా నుండి
|
|
గుండె లేదా హృదయం (Heart) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
[మార్చు] గుండె నిర్మాణం
గుండె మందమయిన కండరపు గోడలు కలిగి ఉంటుంది. ఇది ఉరఃకుహరంలో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న రెండు పుపుసకోశాల మధ్య, కొద్దిగా ఎడమవైపుకు అమరి ఉంటుంది. గుండె వెడల్పయిన భాగం పూర్వభాగం, మొనదేలిన భాగం పరభాగంలో అమరి ఉంటుంది.
గుండెను ఆవరించి రెండు పొరలు కలిగిన హృదయావరణ త్వచం (Pericardial membrane) ఉంటుంది. ఈ రెండు పొరలనూ వేరుచేస్తూ హృదయావరణ ద్రవం (Pericardiac fluid) తో నిండి ఉన్న హృదయావరణ కుహరం (Pericardial cavity) ఉంటుంది. ఈ ద్రవం గుండెను బాహ్య అఘాతాల నూచి కాపాడటమే కాక, గుందె కదలికలో కలిగే రాపిడిని నివారిస్తుంది.
గుండె గోడలో మూడు పొరలు ఉంటాయి. అవి: వెలుపలి ఎపికార్డియమ్ (ఒక పొరలో అమరి ఉన్న మీసోథీలియల్ కణాలతో ఏర్పడుతుంది), మధ్యలో ఉన్న మయోకార్డియమ్ (హృదయ కండరాలతో ఏర్పడుతుంది), లోపలి ఎండోకార్డియమ్ (శల్కల ఉపకళతో ఏర్పడుతుంది).
మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి. అవి: రెండు కర్ణికలు (Atria), రెండు జఠరికలు (Ventricles). రెండు కర్ణికలు గుండె పూర్వభాగాన ఉంటాయి. రెండింటినీ వేరుచేస్తూ కర్ణికాంతర పటం ఉంటుంది. కర్ణికల గోడలు పలచగా ఉంటాయి. పిండదశలో ఈ విభాజకానికి ఫోరామెన్ ఒవాలిస్ అనే చిన్న రంధ్రం ఉంటుంది. శిశు జనన సమయంలో ఊపితితిత్తులు పనిచేయడం ప్రారంభించటం మొదలయిన తర్వాత ఈ రంధ్రం క్రమంగా మూసుకుపోయి ఫోసా ఒవాలిస్ అనే మచ్చ మిగులుతుంది. ఎడమ కర్ణిక కంటె కుడి కర్ణిక పెద్దగా ఉంటుంది. ఇది దేహంలోని వివిధ భాగాలనుంచి (ఊపిరితిత్తులు తప్ప) రెండు పూర్వమహాసిరలు, ఒక పరమహాసిర ద్వారా మలిన రక్తాన్ని గ్రహిస్తుంది.










/
/ 



























