Warning: fopen(dane.txt) [function.fopen]: failed to open stream: Permission denied in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 225

Warning: flock(): supplied argument is not a valid stream resource in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 230

Warning: fclose(): supplied argument is not a valid stream resource in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 231
భారత దేశము - వికీపీడియా


Szukaj:






Ostatnio oglądane:
  • 306 [fr]
  • 埼玉銀行 [ja]
  • Hz [zh]
  • 767 [fr]
  • 薬品 [ja]
  • .bw [en]
  • Július 10 [hu]
  • 386 [hu]
  • 1986 [pl]
  • 环县 [zh]
  • -45 [fr]
  • Main Page [hu]
  • 584 [id]
  • 中國歷代王朝君主世系表 [zh]
  • 790 [ar]
  • 三山区 [zh]
  • Category:北京公园 [zh]
  • 542 [he]
  • Category:水果 [zh]
  • 1985 [pl]
  • 轮回 [zh]
  • 台灣師範大學 [zh]
  • Portal:世界遺産 [ja]
  • 艋舺龍山寺 [zh]
  • 1984 [pl]
  • Strona Głśwna [pl]
  • 歐洲歷史 [zh]
  • Web [es]
  • 吐谷浑 [zh]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en / / | | es | eo | fr | gr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    భారత దేశము

    వికీపీడియా నుండి



    (ఇండియా నుండి దారిమార్పు చెందింది)
    भारत गणराज्य
    భారత గణ రాజ్యము
    Flag of భారత్ భారత్ యొక్క చిహ్నం
    నినాదం
    సత్యమేవ జయతే
    జాతీయగీతం
    జన గణ మన
    భారత్ యొక్క స్థానం
    రాజధాని న్యూ ఢిల్లీ
    28°34′N, 77°12′E
    Largest city ముంబై (బొంబాయి)
    అధికార భాషలు హిందీ, ఆంగ్లము, మరియు 21 ఇతర భాషలు
    ప్రభుత్వం గణతంత్ర సమాఖ్య
     -  రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
     -  ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్
    స్వాతంత్ర్యము
     -  యునైటెడ్ కింగ్ డం నుండి స్వాతంత్ర్యం
    1947ఆగష్టు 15 
     -  గణతంత్ర
    1950 జనవరి 26 
    విస్తీర్ణం
     -  మొత్తం 3,287,590 కి.మీ² (7వ)
     చ.మై 
     -  జలాలు (%) 9.56
    జనాభా
     -  2005 అంచనా 1,080,264,388 (2వ)
     -  2001 జన గణన 1,027,015,247 
     -  జన సాంద్రత 329 /కి.మీ² (31వ)
     /చ.మై
    జీడీపీ (PPP) 2005 అంచనా
     -  మొత్తం $3.334 ‌ట్రిలియన్ (4వ)
     -  తలసరి $3,019 (120వ)
    కరెన్సీ రూపాయలు (Rs.)1 (INR)
    టైం జోన్ భాప్రాకా (UTC+5:30)
     -  వేసవి (DST) లేదు (UTC+5:30)
    ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .in
    కాలింగ్ కోడ్ +91
    1 రూపాయి ఏక వచనము

    భారత గణతంత్ర రాజ్యము నూటపది కోట్లకు పైగా జనాభా తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచం లో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించినది.

    దక్షణాసియా లో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండము లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్[1] దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చినది. 1947 లో స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటీషు సామ్రాజ్యం లో భాగంగా ఉండేది.

    విషయ సూచిక

    [మార్చు] పేరు పుట్టుపూర్వోత్తరాలు

    భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే......). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చినది.

    ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.

    తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు. తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారత దేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే!

    [మార్చు] చరిత్ర

    అశోకుడిచే క్రీ.పూ.3 వ శతాబ్దంలో మధ్య ప్రదేశ్ లోని సాంచీలో నిర్మించబడిన స్థూపం.

    ముఖ్య వ్యాసము: భారతదేశ చరిత్ర

    మధ్య ప్రదేశ్‌ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. ఇదే క్రీ.పూ.26 వ శతాబ్దం మరియు క్రీ.పూ.20 వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రము, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.


    రెండవ సహస్రాబ్ది మధ్యలో, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.


    విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం - జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. 1975, 1977 మధ్యకాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే పౌర హక్కులకు భంగం వాటిల్లింది. భారత దేశానికి చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా 1962లో యుద్ధం జరిగింది. పాకిస్తాన్తో 1947, 1965, మరియు 1971లోను యుద్ధాలు జరిగాయి. అలీనోద్యమంలో భారతదేశం స్థాపక సభ్యురాలు. 1974లో, భారత్ తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. 1998లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. 1991లో జరిగిన ఆర్ధిక సంస్కరణలతో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.

    నృసింహావతారం లో ఉన్న విష్ణుమూర్తి.

    ఇంకా చూడండి:

    [మార్చు] ప్రభుత్వము మరియు రాజకీయాలు

    ప్రధాన వ్యాసము: భారత రాజకీయ వ్యవస్థ

    భారత దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. ఇది పలు రాష్ట్రాల సమాఖ్య. దేశాధినేత అయిన రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజి ద్వారా ఐదేళ్ళ కాలపరిమితికి ఎన్నుకోబడతారు.


    ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధికారాలు గల పదవి. లోక్‌సభలో అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ, లేదా సంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది. ప్రధానమంత్రి సలహా మేరకు, రాష్ట్రపతిచే నితమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకంగా ఉంటుంది. మంత్రులచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.


    భారత దేశపు శాసన వ్యవస్థలో ద్విసభా పద్ధతి ఉంది. ఎగువ సభను రాజ్య సభ అని, దిగువ సభను లోక్ సభ అని అంటారు. లోక్ సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. రాజ్య సభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు.


    న్యాయవ్యవస్థ లో పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు, మరియు అప్పిలేట్ కోర్టులు, హైకోర్టులు ఉంటాయి. కోర్టులకు సూచనలు, ఆదేశాలు, రిట్లు ఇచే అధికారం ఉంది. రిట్లలో హెబియస్ కార్పస్, మాండమస్, నిషేధం, కోవారంటో మరియు సెర్టియోరారి అనే వివిధ రకాలుగా ఉన్నాయి. భారతీయ కోర్టులు రాజ్యాంగ శక్తులు; ఇవి రాజకీయ జోక్యం లేనివి. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు అరుదుగా ఏర్పడే ఘర్షణను రాష్ట్రపతి మధ్యవర్తిత్వం వహించి నివారిస్తారు.


    స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. 1977లో జనతా పార్టీ గా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన భాజపా ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా 1996 తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలే.


    ఇంకా చూడండి :

    [మార్చు] భౌగోళిక స్వరూపము, వాతావరణం

    హిమాలయాలు ఉత్తరాన జమ్మూ కాశ్మీరు నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి భారత దేశపు ఉత్తర సరిహద్దుగా విలసిల్లుతున్నాయి.
    భారతదేశం, ఉపగ్రహ చిత్రం.

    భారతదేశపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. మిగిలిన ఉత్తర భారతం, మధ్య, ఈశాన్య ప్రాంతాలు సారవంతమైన గంగా మైదానంతో కూడి ఉన్నాయి. పశ్చిమాన, పాకిస్థాన్కు ఆగ్నేయ సరిహద్దున థార్ ఎడారి ఉన్నది. దక్షిణ భారత ద్వీపకల్పం దాదాపు పూర్తిగా దక్కను పీఠభూమితో కూడుకుని ఉంది. ఈ పీఠభూమికి రెండువైపులా తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉన్నాయి.


    భారతదేశంలో ఎన్నో ప్రముఖ నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని: గంగ, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి.


    దేశపు దక్షిణాన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరాన స్సమశీతోష్ణ వాతావరణం నెలకొని ఉంది. హిమాలయ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం (టండ్రా) ఉంది. భారత దేశంలో వర్షాలు ఋతుపవనాల వలన కలుగుతాయి.


    ఇంకా చూడండి :

    [మార్చు] రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు

    ప్రధాన వ్యాసము: భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు

    భారతదేశము 28 రాష్ట్రాలుగా విభజించబడినది. (రాష్త్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), ఆరు కేంద్రపాలిత ప్రాంతములు మరియు జాతీయ రాజధాని ప్రాంతము,ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంత ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.

    రాష్ట్రములు:

    1. ఆంధ్ర ప్రదేశ్
    2. అరుణాచల్ ప్రదేశ్
    3. అస్సాం
    4. బీహార్
    5. చత్తీస్ గఢ్
    6. గోవా
    7. గుజరాత్
    8. హర్యానా
    9. హిమాచల్ ప్రదేశ్
    10. జమ్మూ మరియు కాశ్మీర్
    11. జార్ఖండ్
    12. కర్ణాటక
    13. కేరళ
    14. మధ్య ప్రదేశ్
    1. మహారాష్ట్ర
    2. మణిపూర్
    3. మేఘాలయ
    4. మిజోరాం
    5. నాగాలాండ్
    6. ఒరిస్సా
    7. పంజాబ్
    8. రాజస్థాన్
    9. సిక్కిం
    10. తమిళనాడు
    11. త్రిపుర
    12. ఉత్తరాంచల్
    13. ఉత్తర ప్రదేశ్
    14. పశ్చిమ బెంగాల్

    కేంద్రపాలిత ప్రాంతములు:


    జాతీయ రాజధాని ప్రాంతము:

    1. ఢిల్లీ


    భారతదేశము అంటార్క్‌టికాలో territorial claim చేయలేదు కానీ దక్షిణ గంగోత్రి మరియు మైత్రి అను రెండు శాస్త్రీయ స్థావరాలు కలవు.

    చూడండి: జనాభా వారిగా భారతదేశ రాష్ట్రాల జాబితా

    [మార్చు] ఆర్ధిక వ్యవస్థ

    ప్రధాన వ్యాసము: భారత ఆర్ధిక వ్యవస్థ

    వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క ఆర్ధికవ్యవస్థ, ద్రవ్య మారకం పరంగా ప్రపంచంలోనే పదో పెద్ద వ్యవస్థ. పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం ఇది నాలుగో స్థానంలో ఉంది. 2003 లో అత్యధిక వృద్ధి రేటు - 8 శాతం - నమోదు చేసుకుంది. అయితే, అధిక జనాభా కారణంగా, పి.పి.పి ప్రకారం తలసరి ఆదాయం కేవలం 2,540 డాలర్లుగా ఉంది; ప్రపంచ బాంకు జాబితాలో ఇది 143 వ స్థానం. భారత విడేశీమారక నిల్వలు 30 వేల 900 కోట్ల డాలర్లు. దేశానికి ఆర్ధిక రాజధానిగా ముంబై నగరం భాసిల్లుతోంది. భారతీయ రిజర్వు బాంకు కేంద్ర కార్యాలయం, బాంబే స్టాక్ ఎక్స్చేంజి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇక్కడే ఉన్నాయి. 25% ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం విస్తరణ కారణంగా మధ్య తరగతి వర్గం విస్తరిస్తోంది.

    1300 కోట్ల డాలర్ల ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ భారత్ లోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. చిత్రంలో ఉన్నది అగ్రశ్రేణి ఐ.టి సంస్థ, ఇన్‌ఫోసిస్.


    చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన వ్యవసాయం పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు గనులు, పెట్రోలియం, వజ్రాలు, సినిమాలు, జౌళి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, మరియు హస్త కళలు. భారత్ దేశపు పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003-2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. అమెరికా, చైనా, యు.ఏ.ఇ మరియు ఐరోపా సమాఖ్యలు భారత దేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు.


    ఇంకా చూడండి : భారతీయ కంపెనీల జాబితా

    [మార్చు] జనాభా వివరాలు

    ప్రధాన వ్యాసము: భారత జనాభా వివరాలు

    భారత దేశము, చైనా తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై (వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్కతా (వెనుకటి కలకత్తా), మరియు చెన్నై (వెనుకటి మద్రాసు ).


    భారత దేశం యొక్క ఆక్షరాస్యత 64.8%, ఇందులో మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు.


    దేశంలోని 80.5% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిము జనాభా ఇక్కడ ఉన్నారు. (13.4%). ఇతర మతాలు: క్రైస్తవులు (2.33%), సిక్కులు (1.84%), బౌద్ధులు (0.76%), జైనులు (0.40%), యూదులు, పార్సీలు, అహ్మదీయులు, మరియు బహాయీలు. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు. వీటిలో బాగా విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలు శ్రీరామనవమి,వినాయక చవితి,సంక్రాంతి,దీపావళి,